కౌతాళం (ఆంధ్రన్యూస్)
తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంత్రాలయం పాలకుర్తి తిక్క రెడ్డి ఆదేశాల మేరకు క్లస్టర్ ఇంచార్జ్ వెంకటపతి రాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి,ప్రజల సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వ్యతిరేకాలను ఎత్తి చూపి రాష్ట్రంలో జరుతున్నటువంటి అరాచకమైన పాలన ప్రజలకు తెలియజేస్తూ కార్యక్రమం విజవంతం చేయడం జరిగింది, కౌతాళం మండలం బెట్టిగేరి స్ట్రీట్ లొపాల్గొనడం జరిగింది..
వార్డ్ క్లస్టర్ యూనిట్ సభ్యులతో కలిసి ఇంటికి వెళ్లి, ప్రభుత్వ అసమర్ధత గురించి ప్రజలకు వివరించి,అక్కడి ప్రజల అభిప్రాయాలు ఫారం ద్వారా స్వీకరించడం జరిగింది…
ఈ సందర్భంగా వెంకటపతి రాజు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ,
నిరుద్యోగ సమస్య, అడ్డగోలు నిత్యావసర ధరలు, మద్యపానం, కుంటుపడిన అభివృద్ధి, ఇసుక మాఫియా, త్రాగునీటి సమస్య, అవినీతి, మహిళల భద్రత, కరెంటు సమస్య, రోడ్ల సమస్య, నిధుల దుర్వినియోగం, గిట్టుబాటు ధరలు, నిలకడలేని పాలన, రాజధాని రాజకీయాలు వంటి ఏ రకమైన సమస్య ఉందో అడిగి తెలుసుకుని 9261292612 ఫోన్ నెంబర్ కు వారి మొబైల్ నుండి మిస్డ్ కాల్ ఇప్పించడం జరిగింది, ఈ కార్యక్రమంలో బీసీ సాధికార రాష్ట్రసభ్యులు సిద్దు, ఐ టి డి పి తాలూక అధ్యక్షులు మంజునాథ్,బిసిసాధికారరాష్ట్ర సభ్యులు సిద్దు, జిల్లా మైనార్టీ కార్యదర్శి రెహమాన్ ,డాక్టర్ రాజనంద్,గొట్టయ్య ,తదితరులు పాల్గొన్నారు.