కౌతాళం డిసెంబర్ 04 ఆంధ్ర న్యూస్ రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదు అని కర్ణాటక మద్యము, అక్రమ ఇసుక, అవినీతి తప్ప ప్రజలకు ఏమి చేయలేక పరిపాలన లో విఫలం అయింది. టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బసప్ప మరియు క్లస్టర్ ఇంచార్జ్ వెంకటపతి రాజు అన్నారు వారు కౌతాళం మండలంలోని కుంటన హాల్ గ్రామాలలో ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు ఎన్నికలలో వైయస్సార్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మోసము చేసిన పార్టీ వైయస్సార్ పార్టీ అని క్లస్టర్ ఇంచార్జ్ వెంకటపతి రాజు పొలాలలో పని చేసే రైతులు సమస్యలు, తెలుసుకున్నారు ప్రజలకు అండగా ఉండే పార్టీ తెలుగు దేశం పార్టీ అని రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత ప్రజలకు మంచి పనులు చేస్తాం అని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్రీ బసవన్న గౌడ్, వెంకటేష్ గౌడ్, నవీన్ గౌడ్, భాష, మాల చంద్ర,కురుబ వీరేష్, డాక్టర్ రాజానంద్, ఐటీడీపీ ఊ అధ్యక్షులు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823