మెట్టజ్యోతి: ఏలేశ్వరం:
ఏలేశ్వరం .నగర పంచాయతీలో స్థానిక ఏపీఎస్ఆర్టీసీ జోనల్ కమిటీ పిలుపు మేరకు జోనల్ లో ఉన్న అపరిస్కృత సమస్య లను పరిష్కరించాలంటూ డిపో అధ్యక్షులు కె ఎస్ కె రావు మరియు డిపో కార్యదర్శి కే త్రిమూర్తులు ఆధ్వర్యంలో రెండు రోజుల రిలే నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించారు. దీక్ష శలో కే ఎస్ నారాయణ మరియు కే ప్రవీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ, ఎప్పటినుండో అపరిస్కృతంగా ఉన్న, ఓటీలు చెల్లించినటువంటి డ్యూటీలను స్పెషల్ ఆఫ్ డ్యూటీలుగా మార్చాలని, కేంద్ర కార్యాలయం ఇచ్చిన1/19 సర్కిలర్ అమలు చేయాలని, గ్యారేజీ సిబ్బందికి నాణ్యమైన స్పేర్స్ మరియు టూల్స్ తో పాటు రోజుకు 8 గంటల పని విధానం అమలు చేయాలని, మహిళా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, కేఎంపిఎల్ మరియు ఏపీకే ల పేరుతో వేధింపులు ఆపాలని, అన్ని రూట్లు సర్వే చేసి సరిపడా రన్నింగ్ టైం లో ఇవ్వాలని, మరియు బస్సుల కండిషన్ మెరుగుపరచాలని తమ డిమాండ్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సతీష్, ఎడిసి చిన్నారావు, పల్లి వీరబాబు, చినబాబు, రంగంపేట శ్రీను, గ్యారేజ్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్ష
RELATED ARTICLES