
ఆరికరేవుల గ్రామం లో ఘనంగా జరిగిన గొల్లలమ్మా, గోగులమ్మ జాతర
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామం లో గ్రామ వైస్సార్సీపీ కన్వీనర్ తొండాపు గాంధీరెడ్డి అధ్యక్షతన శ్రీ. శ్రీ.శ్రీ. గొల్లలమ్మా, గోగులమ్మ జాతర మహోత్సవానికి ముఖ్య అతిథులుగా బిక్కవోలు మండల పరిషత్ అధ్యక్షులు కొవ్వూరి జ్యోతిర్మయి సత్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ పాల్గొన్నారు ఈ జాతరలో గ్రామంలోని భక్తులందరూ కులమతాలకు సంబంధం లేకుండా పాల్గొన్నారు, అధిక సంఖ్యలో చుట్టు ప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు ప్రతిఒక్కరూ జాతర చూడటానికి వచ్చారు కనులు మిరమిట్లు గొలుపే బాణాసంచాతో, దేవాలయం చుట్టూ విద్యుత్ దీపాలంకరణతో అందంగా అలంకరించి నారు. కొవ్వూరి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ ఆరికరేవుల గ్రామంలో వేంచేసియున్న గొల్లలమ్మా, గోగులమ్మ మహోత్సవం వైభవంగా జరుగుతున్నాయి పూర్వకాలపు ఆచారం ప్రకారం నేటికీ గ్రామస్తులందరు కూడా కులాలకు అతీతంగా ఏకమై ఈ జాతరను ఎంతో వైభవంగా జరుపుకోవాలని గ్రామానికి శుభపరిణామం అన్నారు ఈ జాతర ప్రత్యేకత ముఖ్యంగా ఆరికరేవుల గ్రామ ప్రజలు ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా హాజరవుతారు అన్నారు.జాతరలో అమ్మవారికి భక్తులు నైవేద్యాలు అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించినారు ఈ కార్యక్రమంలో కొంకుదురు ప్రాధమిక కేంద్రం డైరెక్టర్ చిన్నబజ్జి , ఎంపీటీసీ కొర్ల చక్రధరరావు , ఉపసర్పంచ్ శాఖ రాజు, సచివాలయ కన్వినర్ కొర్ల శ్రీనివాసరావు, రైతు భరోసా కేంద్రం అధ్యక్షులు మహిపాలా సత్తిబాబు,నీటి సంఘము డైరెక్టర్ కొర్ల నాగేశ్వరావు,వార్డ్ మెంబెర్ కొర్ల వీరశేఖర్,నాయకులు మహిపాలా ఆదినారాయణ, భజన శ్రీను భక్తులు తదితరులు పాల్గొన్నారు…



