
బిక్కవోలు, ఆంధ్రన్యూస్ : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో కార్తీక మాసం నాల్గవ సోమవారం శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉమా పార్టీవేశ్వర సహిత శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికీ అభిషేకములు లక్ష బిల్వార్చన అమ్మవారికి మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉమా పార్టీవేశ్వర (54 మట్టి శివలింగాలతో) ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి అనంతరం పూజా కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందల వీరబాబు మాట్లాడుతూ కార్తీక మాసం విశిష్టమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం, ఈ నెలలో సోమవారం ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మాలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్ష కార్తీకం లభిస్తుందని, ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివుని కొలిస్తే మాంగళ్య భాగ్యం సిద్ధిస్తుందని,ఈ మాసమంతా ఉపవాసముండి శివునికి శివుని కొలిచినట్లు అవుతుంది. వీరబాబు అన్నారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు ఆరికరేవుల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నార
7



