
ఆఫీస్ సమయం లో ఇల్లపల్లి పంచాయతీకి గడియ !
.ఉన్నతాధికారుల కన్నా సర్పంచ్ మాటే మిన్న అంటున్న పంచాయతి అధికారులు
బిక్కవోలు, ఆంధ్రన్యూస్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇల్లపల్లి పంచాయతీకి పలు వివరాల కోసం పాత్రికేయులు వెళ్లగా పంచాయతీకి గడియ పెట్టి ఉండటం పాత్రికేయులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి అశోక్ ని వివరణ కోరగా తాను ఇన్చార్జిగా కాపవరం పంచాయతీలో ఉన్నానని వివరణ ఇచ్చారు అయితే మిగతా సిబ్బంది సర్వే నిమిత్తం బయటకు వెళ్లారంటూ తప్పించుకునే ధోరణిలో సమాధానం చెప్పడం గమనార్హం. ఒక గంట తర్వాత ఇంజనీరింగ్ అసిస్టెంట్ భవ్య వచ్చి పంచాయతీ గడియ తియ్యడం తో ఆమెను పాత్రికేయులు వివరణ కోరగా అందరూ సర్వే కి వెళ్ళారని ఆమె బదులిచ్చింది అనంతరం మూమెంట్ రిజిస్టర్ పరీక్షించగా ఒక్క డీసీ తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా మూమెంట్ రాయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనంతరం శనివారం ఉదయం శుక్రవారం జరిగిన విషయంపై పంచాయతీ కార్యదర్శి అశోక్ ని వివరణ కోరగా లోకల్ గా ఎక్కడికెళ్లినా మూమెంట్ రాయమని అంతేకాకుండా నిన్న మీరు వచ్చేసరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లోపల ఉందని ఆమెను లోపల ఉంచి బయట గడియ పెట్టి ఫోటోలు వీడియోలు తీశారని అలాగని గ్రామ సర్పంచ్ లోల్ల భద్రం చెప్పారని చెప్పడం విశేషం అయితే ఏం జరిగిందని ఇంజనీరింగ్ అసిస్టెంట్ భవ్యని వివరణ కోరగా నేను బయట నుంచి వచ్చేసరికి పంచాయితీ ఆవరణలో పాత్రికేయులు ఉన్నారని నేను తలుపు తీసిన తర్వాత లోపలికి వచ్చి వీడియోలు ఫోటోలు తీసుకున్నారని అంతేగాని గ్రామ సర్పంచ్ చెప్పింది ఏమీ జరగలేదని ఆమె వివరణ ఇచ్చారు. దీనిని బట్టి గ్రామ సర్పంచ్ చేతిలో పంచాయతీ కార్యదర్శి కీలుబొమ్మ అయ్యారని పంచాయతీ కి సంబంధించి కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి అని పలు అరోపణలు వినిపిస్తున్నాయి. పుంత రోడ్డు లకు అక్రమ గ్రెవల్ ఉపయోగించి గ్రావెల్ కొని వేసినట్టు బిల్లులు పెట్టుకుంటున్నారనే ఆరోపణ కూడా గట్టిగానే వినబడుతున్నాయి. అంతే అంతే కాకుండా ఉపాధి హామీ పథకం లో కూడా పలు అవకతవకలు జరుగుతున్నాయి అని ఇక్కడి ప్రజలు చెవులు కోరుక్కుంటున్నారు. పంచాయతీ అధికారులు వాళ్ల విధులను గాలికి వదిలి ప్రవర్తించడం వెనక గ్రామ సర్పంచ్ ఉన్నారని వారి మాటలను బట్టి అర్థమవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు అయితే ఇటువంటి అవకతవకలకు కారణం సర్పంచ్ కి చెక్ పవర్ ఉండడమేనని చెక్ పవర్ ని రద్దు చేస్తే ఇటువంటి అవకతవకలు జరగకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా పని చేయవలసిన కాలంలో పంచాయతీకి గడియా పెట్టిన అధికారులపై తక్షణం ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు



