
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా
ఆదోని డివిజన్ లో శారదని కేతన్ ప్రైవేట్ పాఠశాల బయట బహిరంగంగా ఫీజులు పట్టిక వేయాలి.అలాగే ఫీజుల విషయంలో విచారణ చేసి తక్షణమే పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డి.ఎస్.ఎఫ్ డిమాండ్.అనంతరం డీపీటీ,డిఈఓ కార్యాలయంలో ఇన్చార్జ్ అధికారికి వినతిపత్రం డి.ఎస్.ఎఫ్ నాయకులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మురళి మాట్లాడుతూ అలాగే ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి శారదని కేతన్ ప్రైవేట్ పాఠశాల లో ఫీజుల విషయంలో విచారణ చేసి, అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఫీజులు వసూలు చేస్తూ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.అలాగే స్కూల్ ఫీజు బుక్స్ ఫీజు యూనిఫామ్ ఫీజు బస్సు అంటూ ఇలా అనేక రకాలుగా విద్యార్థులకు తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.సరే,కనీసం ఫీజులకు తగ్గట్టు అన్న పాఠశాలలో కనీసం పిల్లలకు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉందా,లేదు తెలియదు.? పార్కింగ్ ప్లేస్ కూడా లేదు.అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే శారదాని కేతన్ ప్రైవేట్ పాఠశాల పై విచారణ చేసి తక్షణమే పాఠశాల యొక్క గుర్తింపు రద్దు చేయాలని డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘంగా కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ మండల కార్యదర్శి వినోద్,విక్రమ్,రమేష్,కిరణ్,అబ్దుల్లా,వరుణ్,తేజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.



