
ఆక్రమణదారుడు తో కుమ్మక్కుఅయ్యిన బలబద్రపురం పంచాయితీ కార్యదర్శి
బిక్కవోలు ఆంధ్రన్యూస్ : అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురం లో రామ రాజు చెరువు ఆక్రమణ లో భాగంగా ఆర్ అండ్ బి రోడ్ పై నిర్మించిన షెడ్డు విషయం పై గత నెల రోజులు గా వివాదం నడుస్తూ వుంది. ఉన్నతా ధికారుల ఆదేశాలు మేరకు పంచాయతీ కార్యదర్శి ఈ రోజు ఈ ఆక్రమణలు తొలగిస్తూ తిరిగి స్తంభాలు వేసుకొని వాటిపై బరకం వేసి తాత్కాలికంగా వాడుకొమ్మని ఆక్రమణ దారుడికి చెప్పడం హాస్యాస్పదం గా ఉందని స్థానికులు అంటున్నారు. ముందుగా రోడ్ ఆక్రమించుకొని షెడ్ వెయ్యడం దానిపై పిర్యాదు రావడం తో మంచి నీరు పొసే కేంద్రం పెట్టడం జరిగింది. పంచాయతీ అధికారుల ప్రోత్సాహం తో అక్కడ వ్యాపార కేంద్రం ఏర్పాటు చేసిన ఆక్రమణదారు పై అధికారుల ఆదేశాలు ప్రకారం ఆక్రమణ తొలగించినా పంచాయతీ కార్యదర్శి సహకారం తో తిరిగి మంచి నీటి కేంద్రం ఏర్పాట్లు చెయ్యడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే బలభద్రపురం వెంబడి ఆర్ అండ్ బి, ఇరిగేషన్ స్థలాలు పూర్తిగా ఆక్రమణ దారుల చేతుల్లో కి పోయినా మిగిలిన స్థలాలు కూడా ఇటువంటి అధికారుల అండ తో ఆక్రమించుకొని వాహన దారులకు ఇబ్బంది కలిగించడం జరుగుతుంది. భవిష్యత్తు లో ఏదయినా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.



