కౌతాళం నవంబర్ 12 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నరేంద్ర మోడీ విశాఖపట్నం వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కే మల్లయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వము అధికారంలో రాకముందు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని, ఐదు సంవత్సరాలు కాక పది సంవత్సరాలు వరకు కొనసాగిస్తామని, వెనకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయిస్తామని అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలైనా ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మంచి ఆదాయంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించాలని బిజెపి ప్రభుత్వం కుతూ కూతు ఆడుతున్నది అని అన్నారు. రైతులకు మూడు వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి, మార్కెట్ను చిన్నాభిన్న చేయాలని, ధరల స్త్రీ కరుణ చట్టం చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నారు
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ మేలిగిరి ఈరన్న, మండల నాయకులు నర్సింలు, ఉల్లిగయ్య, వెంకటేశులు, వెంకన్న ,వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823