అరకు :ఆంధ్రన్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం పరిధిలోగల డుంబ్రిగూడ ఎస్ఐ సంతోష్ కుమార్ పోలీస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో 2023 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ఘనముగా జరిగింది ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రన్యూస్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు మెట్టజ్యోతి ప్రింట్ మీడియా ఈ రెండు సమాజాన్ని ముందుకు నడిపిస్తూ పాత్రికేరంగం లో ముందు వరసలో ఉన్నాయి అన్నారు. ఆంధ్రన్యూస్ కేబుల్ ఛానల్ సమాజానికి ఉపయోగపడి ప్రజలను, ప్రభుత్వాన్ని మేలుకొలిపే విధంగా ఇంకా ఉండాలని తెలియజేస్తూ ప్రజల సమస్యలు వెలుగులోకి తీసికొని వచ్చి ప్రచురణ చేయాలని కోరుకుంటూ ఆంధ్రన్యూస్ యాజమాన్యానికి మనస్పూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ, ఎమ్మార్వో, ఎంపీడీవో , పాత్రికేయ మిత్రులు మరియు సంజీవ్ మల్లేశ్వరరావు, మండల వైయస్సార్ సిపి నాయకులు సింహాచలం గోపాల్ గణపతి నర్సింగ్, ఎంపీపీ ఈశ్వరి, జడ్పిటిసి జానకమ్మ, ప్రజానీకి ఉద్యోగ సంఘం నాయకులు, డుంబ్రిగూడ మండలం రిపోర్టర్ యస్. సంజీవరావు, కోటి సింహాచలం బాసు, రిపోర్టర్ టి.నీలకంఠం రిపోర్టర్ సామెల చిన్నారావు పాల్గొన్నారు.