
రాయచోటి : ఆంధ్రన్యూస్. రాయచోటి సుద్దలవాండ్లపల్లె రహదారి మార్గం అయ్యప్ప గుడిలో పూజలు నిర్వహించి అన్నదానంలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి
అయ్యప్పదీక్ష ఆరోగ్య రక్ష అని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.శనివారం రాయచోటి పట్టణం సుద్దలవాండ్లపల్లె రహదారి మార్గం అయ్యప్ప గుడిలో జరిగిన ప్రత్యేక పూజలలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎస్ ఎం బి టైల్స్ ఓనర్ లోకేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ స్వాములకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప మాల ధారణ నియమాల తోరణమన్నారు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థమన్నారు. ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై సంపూర్ణ ఆరోగ్యం క్రమశిక్షణతో కూడిన జీవన విధానం , ధార్మిక భావాలు అలవడుతున్నాయన్నారు.అన్నదాన కార్యక్రమం నిర్వహించచిన లోకేశ్వర్ రెడ్డి ని శ్రీకాంత్ రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సొసైటీ అధ్యక్షుడు బసిరెడ్డి స్వామి, ట్రెజరర్ మల్లన్న స్వామి, మండల బిసి నాయకులు పల్లపు రమేష్,జానం రవీంద్ర యాదవ్, బిసి సెల్ విజయ భాస్కర్,సుగవాసి శ్యామ్, కొత్తిమీర ప్రసాద్, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



