
మెట్టజ్యోతి : జంగారెడ్డిగూడెం.ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగి డిగూడెం గ్రామంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ కామినేని హాస్పిటల్, ఏలూరు శంకర నేత్రాలయ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రామచంద్ర కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో కంటి వైద్య పరీక్షలు షణ్ముఖ రెడ్డి ప్రారంభించారు. ఆర్థోపెడిక్ విభాగాన్ని పందిరి గూడెం గ్రామ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కార్డియాలజీ విభాగాన్ని ఉప సర్పంచ్ పి సురేష్ రెడ్డి ప్రారంభించారు. గైనకాలజీ విభాగాన్ని మురళీకృష్ణ రెడ్డి ప్రారంభించారు. జనరల్ విభాగాన్ని రవిచంద్ర రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరానికి సుమారుగా 369 మంది హాజరవడం జరిగింది. వారిలో వివిధ విభాగాల పేషెంట్లు ఉన్నారు. 36 మందికి కంటి ఆపరేషన్లకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ మాండ్రు చంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత మందు బిళ్ళలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శిబిరం ఆర్గనైజర్ చిటికెల రాంబాబు వైద్యఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంధ సేవా సంస్థ సభ్యులు కూరెళ్ళ రాంబాబు, రామిశెట్టి కిషోర్, వేగవరం భాను, నెమలిగిరి చిరంజీవి, లక్కవరం బాబు స్థానిక పంగిడిగూడెం సభ్యులు మాండ్రు చందర్రావు ఆర్ఎంపీ డాక్టర్ గద్ద తమ్మయ్య,కుంచే కుటుంబరావు, దుద్దే విజయ్, బేతాళ నాగబాబు, మాండ్రు శ్రీనివాస్, మాండ్రు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.



