

శంఖవరం, ఆంధ్ర న్యూస్ : మండలం లోని అన్నవరం గ్రామం రైల్వే స్టేషన్ కి వెళ్లే రహదారిని అనుకుని ఉన్న శ్రీ జీవన్ జువ్యలరీ దుకాణం నందు ఇద్దరు వ్యక్తులు శుక్రవారం దొంగతనానికి పాల్పడ్డారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు మేరకు పెద్దాపురం డిఎస్పి డి. శ్రీహరి రాజు పరివేక్షణలో శ్రీ జీవన్ గోల్డ్ షాప్ యజమాని వరద లక్ష్మణ్ రావు హాస్పటల్ సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీ హరిబాబు కేసు నమోదు చేశారు. దుండగులను శుక్రవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అన్నవరం పోలీస్ స్టేషన్లో శనివారం మధ్యాహ్నం డిఎస్పి. డి. శ్రీహరి రాజు మీడియాతో మాట్లాడుతూ, తొండంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామానికి చెందిన సీతారాంపురం గ్రామ సర్వేయర్ గా పనిచేస్తున్న ఉద్దగిరి అఖిల్ (24) తండ్రి మాణిక్యాలరావు, మరియు అదే గ్రామానికి చెందిన మామిడి రాజు (24) (తండ్రి) వీరబాబు చెడు వ్యసనాలకు అనగా త్రాగుడు జోదం బెట్టింగుకు బానిసై తలకు మించిన అప్పులు చేసి దొంగతనం చేసి సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అనే దురుద్దేశంతో సుమారు వారం రోజుల నుండి శ్రీ జీవన్ గోల్డ్ షాప్ నందు రెక్క చేసి దొంగతనానికి అవసరమైన మరణ ఆయుధాలను ముందుగానే కొనుగోలు చేసి వారిని ఎవరు గుర్తుపట్టకూడదని రైన్ కోట్లు ధరించి హెల్మెట్ పెట్టుకుని నెంబర్ ప్లేట్ లేని స్కూటీ మీద వచ్చి సుత్తి బ్లేడు చాకు కారంపొడి త్రాడు పట్టుకుని గోల్డ్ షాప్ కి ప్రవేశించి షాపు యజమాని అయిన వరద లక్ష్మణ్ రావు ని ఆయన భార్య మరియు అతని అన్న కొడుకు పై సుత్తితో దాడి చేసి తీవ్రమైన రక్తపు గాయములు కలగజేసి సుమారు కేజీన్నర బంగారు ఆభరణాలను సంచిలో వేసుకుని దోపిడీ చేసి పారిపోవు చుండగా చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళను పట్టుకొని ఆభరణాలను షాపు యజమానికి అప్పగించి ముద్దాయిలను పోలీసులకు అప్పగించడం జరిగిందన్నారు. ముద్దాయిలను చర్య నిమిత్తం పెద్దాపురం కోర్టుకు తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



