ఎమ్మిగనూరు, నవంబర్ 30(ఆంధ్రన్యూస్)ఎమ్మిగనూరు పట్టణం ఎద్దుల మార్కెట్ వద్ద గత వారం రోజులుగా అనాధ వృద్దరాలు గౌరమ్మ కాలు విరిగి బాధపడుతున్న విషయం తెలిసిందే.బుధవారం ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సూపర్ వైజర్ ఉప్పుర రాము స్పందించారు. గౌరమ్మ దీన స్థితి ను చూసి చలించిపోయిన రాము మానవత్వం చాటుకున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని పూలే అంబేడ్కర్ ఎడ్యుకేశన్ సొసైటీ అధ్యక్షులు ఏనుగుబాల నరసన్న తో రాము కలిసి కాలు విరిగి గాయాలు తో బాధపడుతున్న గౌరమ్మ కు వైద్యం చేయించి కొత్త దుస్తులు తెప్పించి స్నానం చేయించారు. ఈ సందర్భంగా పూలే అంబేడ్కర్ ఎడ్యుకేశన్ సొసైటీ అధ్యక్షులు నరసన్న మాట్లాడుతూ గౌరమ్మ కు సాయం చేసిన మార్కెట్ రాము మంచి మనసుకు ధన్యవాదాలు తెలిపారు.గౌరమ్మ ను తమ ఆశ్రమం లో చేర్పించుకున్నట్లు తెలిపారు. ఆదరణ లేక అనాదులు గా ఉంటున్న వారిని తమ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు లోని హెచ్బీఎస్ కాలని లో నడుస్తున్న ఆశ్రమంలో చేర్చుకుంటామన్నారు. వివరాలకు 9676390060, 9676072260 సెల్ ఫోన్ నెంబర్స్ కు సంప్రదించాలని కోరారు.
అనాధ వృద్ధురాలి కు మార్కెట్ కమిటీ రాము చేయూత.పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ లో ఆశ్రయం.వృద్ధురాలికి వైద్య సేవలు.
RELATED ARTICLES