Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాఅధికారుల కళ్ళు కప్పి కాలువలు తవ్వేస్తున్న వైనం . ఇప్పటికే నీరు అందడం లేదని గగ్గోలు...

అధికారుల కళ్ళు కప్పి కాలువలు తవ్వేస్తున్న వైనం . ఇప్పటికే నీరు అందడం లేదని గగ్గోలు పెడుతున్న రైతులు .ఇటుకల బట్టికి ఇరిగేషన్ కాలువలు బలి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో సూరారెడ్డి నర్సింగ్ హోమ్ పక్కన ఉన్న ఇటుకల బట్టి యజమాని ఇరిగేషన్ అధికారుల కళ్ళుగప్పి ఎదురుగా ఉన్న టి ఎస్ ఎస్ కాలువను తవ్వి సుమారు 200 ట్రిప్పుల మట్టిని కాజేశారంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టి ఎస్ ఎస్ కాలువ నిజానికి మూడు మీటర్లు ఉండవలసి ఉండగా ఇప్పుడు దానిని సుమారు 5 మీటర్లు చేసి కిలోమీటర్ పొడవునా గట్టు తీసి మట్టిని తన బట్టీలో వేసుకున్నాడు అంటూ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ బట్టి సూరారెడ్డి నర్సింగ్ హోమ్ పక్కనే ఉండడం రాత్రులు ఇటుకలు బట్టి లో ఇటుకలను కాల్చడం బట్టి నుంచి వచ్చే పొగ ఆసుపత్రి లోపలికి వెళ్లి రోగులను ఇబ్బంది పెట్టడం అప్పుడప్పుడు జరుగుతూ ఉందని ఆసుపత్రిలోని రోగులు పలువురు ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయని పలువురు తెలిపారు ఇదే విషయమై బట్టి యజమానిని అడగగా బట్టిలో కళ్ళముందు కాలువ మట్టి కనిపిస్తూ ఉండగా కాలువ తవ్వలేదంటూ కాలువ మీద వంతెన మాత్రమే నిర్మించానని మీకు నచ్చినది చేసుకోండి నా వెనుక పెద్దపెద్ద వాళ్లు అధికార పార్టీ నాయకులు ఉన్నారంటూ బహిరంగంగా తెలపడం విశేషం అయితే ఇదే విషయమై రైతులు మాట్లాడుతూ కాలువను ఇలా తవ్వేయడం వల్ల కిందకు నీరు ప్రవహించదని ఇప్పటికే ఈ కాలువ వల్ల కిందకు నీరు అందడం లేదని ఇంత భారీగా తవ్వడం వల్ల ఇప్పుడు మొత్తానికి నీరు అందదని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇదే విషయమై ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించగా ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టి ఎస్ ఎస్ కాలువ పూడిక తీయడం జరుగుతోందని అయితే ఈ సంవత్సరం మా ఉద్యోగుల్లో ఒకరు తిరుపతి వెళ్లడం తాను ఉన్నత అధికారులతో సమావేశంలో ఉండడం అదునుగా చూసుకుని కాలువ రూప రేఖలను మార్చేసాడని కాలువ అయితే భారీగానే తవ్వారు కానీ మట్టి ఎంత తీసేరనేది చూడవలసి ఉందని దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బట్టిలో ఉన్న మట్టిని కానీ లేదా బట్టీ పై కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఇటుకను కాల్చినప్పుడు భారీ మొత్తంలో పొగరావడం భారీ కాలుష్యానికి దారి తీస్తుందని పక్కనే ఆసుపత్రి ఉండటం ఆపరేషన్ చేయించుకున్న రోగులు ఈ గాలి పీల్చడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని కనుక వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బట్టిని మూయించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణం బట్టి యజమాని పై చర్యలు తీసుకుని కాలువను సరిచేసి కింద రైతులకు నీరు అందించే విధంగా చేయాలని పలువురు రైతులు కోరుకుంటున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments