Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాఅత్యంత దురదృష్టకరమైన సంఘటన. తమిళనాడులో విషాదం.. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట. 30 మంది మృతి.. మృతుల్లో...

అత్యంత దురదృష్టకరమైన సంఘటన. తమిళనాడులో విషాదం.. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట. 30 మంది మృతి.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు.. మరో 50 మంది పరిస్థితి విషమం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

(కర్నూలు ఆంధ్రన్యూస్)
తమిళనాడు: తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూర్లో ఈరోజు విజయ్ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది.మొత్తం 30మందికి పైగా మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు.పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 50 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కరూర్లోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళగా వెట్రీ కజగం (TVK) మద్దతుదారులు, విజయ్ అభిమానులు భారీ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. విజయ్ ఈ ర్యాలీకి దాదాపుగా 6 గంటలు ఆలస్యంగా వచ్చారని తెలుస్తోంది. తొక్కసలాటపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ర్యాలీలో చిన్నారి తప్పిపోయిందనే వార్త రాగానే, ఒక్కసారిగా జనాలు తోసుకోవడం ప్రారంభించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments