మెట్టజ్యోతి,శంఖవరం : ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురై తాటాకిల్లు పూర్తిగా ధ్వంసమై నిరాశ్రయానికి గురైన బాధితులకు అండగా ప్రత్తిపాడు నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ వరుపుల రాజా నిలబడ్డారు. మండలంలోని నెల్లిపూడి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో కాలిపోయి బూడిదయిన తాటాకి ఇళ్లను,ప్రమాద స్థలాన్ని నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ వరుపుల రాజా మరియు తెదేపా నాయకులు పరిశీలించి బాధిత కుటుంబాలకు బియ్యం బస్తాలు, నిత్యవసర వస్తువులు, ఆర్థిక సహాయం అందజేసి అన్ని విధాల అండగా ఉంటానని తెదేపా అధికారంలోకి రాగానే బాధితులకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న శివ, మాజీ జడ్పిటిసి బచ్చల గంగ, తెదేపా మండల అధ్యక్షులు బద్ది రామారావు, తెదేపా నాయకులు ఉల్లి వీరభద్రరావు, కీర్తి సుభాష్, బద్ది రమణ, సిల్లీ పంపరాజు, సామర్ల మధు, కంచి బోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాద బాధితులకు వరుపుల రాజా సహాయం
RELATED ARTICLES