
అక్రమ తవ్వకాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ?
. మండలంలో విఆర్వోల కనుసన్నల్లోనే మట్టి దందా
. ఎమ్మార్వో ఆజ్ఞలు తూతూ మాత్రమేనా !
బిక్కవోలు, ఆంధ్రన్యూస్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇల్లపల్లి గ్రామంలో ఆగని మట్టి దందా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రాత్రికి రాత్రి పొలాల్లో ఉన్న మట్టి తీసి రోడ్లు పక్కన గుట్టలుగా వేసి తెల్లవారేసరికి ఏమీ ఎరగనట్టు ప్రవర్తిస్తున్నారు రాత్రికి లారీలపై మట్టి మాఫియా అమ్మకాలు జరుపుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరైనా అడిగితే ఈ నెపాన్ని ఎమ్మెల్యే పై నెట్టేస్తూ చేతులు దులుపుకుంటున్నారు అయితే మట్టి దందా నిర్వహించేవాళ్లు ఎమ్మెల్యే అనుచరులు కావడం వీరిపై ఎమ్మెల్యే కఠిన చర్యలకు ఆదేశించకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదే విషయమై ఎమ్మార్వో పోసు బాబుని వివరణ కోరగా మండలంలో ఎవరికి కూడా మట్టి త్రవ్వకాలకు కానీ గ్రావెల్ త్రవ్వకానికి కానీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఎక్కడైనా మట్టి తీస్తున్నట్టు తన దృష్టికి తెస్తే వెంటనే కఠిన చర్యలు ఉంటాయని ఆయన వివరించగా పలు గ్రామాల్లో మాత్రం వీఆర్వోలు పగలు గుట్టలుగా వేసుకోమని రాత్రుళ్ళు లారీలపై మట్టి అమ్మకాలు జరపమని సలహాలిస్తూ వాళ్ల జేబులు నింపుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా వీఆర్వోలను కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎవరైనా మట్టి తవ్వకం వివరాలు తెలిపితే ముందుగా మట్టి తవ్వకం వారికి ఉప్పందించి వాళ్ళను అక్కడ నుండి వెళ్ళిపోమని తీరిగ్గా తర్వాత వీఆర్వోలు వస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మొత్తం మట్టి మాఫియా వీఆర్వోల కనుసన్నల్లో జరుగుతుందని గ్రామాల్లోని ప్రజలు పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రులు అయితే వీఆర్వోలు రాత్రి సమయంలో ఏమి వస్తామని తప్పించుకునే అవకాశం ఉంటుంది కనుక రాత్రులు పెట్టుకోమని భారీ మొత్తంలో ముడుపులు వసూలు చేసుకుంటున్నారని పలు గ్రామాల్లో ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మట్టి దందాకు సహకరిస్తున్న వీఆర్వోలపై కఠిన చర్య తీసుకోవాలని పలువురు కోరుతున్నారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మట్టి దందా చేసే అనుచరులను దూరంగా ఉంచకపోతే నిజాయితీపరుడనే పేరుకి తూట్లు పడే అవకాశం ఉందని సొంత పార్టీ వారే గుసగుసలాడుకుంటున్నారు



