మెట్టజ్యోతి .దేవిపట్నం మండలంలో గోదావరి టూరిజం పర్యటక బొట్లు భద్రతప్రమాణలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు, గురువారం దేవీపట్నం మండలం పోచమ్మగండి నుండి బయలుదేరే టూరిజం బోట్లను ఏవిధముగా భద్రత ప్రమాణాలు పాటించుచున్నది ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ ఆకస్మికంగా పర్యటించి పరిశీలించారు, ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి సురాజ్ గనూరే మాట్లాడుతూ టూరిస్టులు టికెట్లు తీసుకున్న వారందరికి సంబంధించిన జాబితా అదేవిధంగా ఏ బోట్లులో ఎంతమంది టూరిస్ట్ ఉన్నది లిస్టు పక్కాగా ఉండాలని ఆయన ఆదేశించారు, టూరిస్ట్ ఉన్న ప్రతి బోటులో లైఫ్ జాకెట్లు తప్పకుండా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. దేవీపట్నం మండలంలోని పర్యాటక ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పక్కాగా చేయించాలని సంబంధిత అధికారులను ప్రాజెక్ట్ అధికారి ఆదేశించారు. టూరిజాం శాఖకు సంబంధించిన కంట్రోల్ రూమ్‌ను ప్రాజెక్ట్ అధికారి. సబ్ కలెక్టర్ వారు పరిశీలించారు ఈ కంట్రోల్ రూమ్ లో ప్రతిరోజు ఎన్ని బోట్లు తిరుగుచున్నవి ఎంతమంది టూరిస్టులు వచ్చుచున్నది అదేవిధంగా టూరిస్టులకు భద్రత ఏ విధంగా కల్పించుచున్నది తదితర వివరాలు ప్రాజెక్ట్ అధికారి.సబ్ కలెక్టర్ వారు ఆరా తీశారు. పోచమ్మ గండి నుండి గోదావరిలో పర్యటక బోట్‌కు అన్ని అనుమతులు ఉంటేనే బోట్లకు అనుమతించాలని లేనియెడల ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని ప్రాజెక్ట్ అధికారి పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ వీరభద్రరావు. టూరిజన్స్ ఆకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు