మెట్టజ్యోతి, రాయవరం : ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో కార్తీకవన సమారాధనలో భాగంగా శనివారం విశాఖకు చెందిన ఓమ్ని ఆసుపత్రి సౌజన్యముతో, సోమేశ్వరం గ్రామానికి చెందిన తమలంపూడి వెంకటరామారెడ్డి (అబ్బురెడ్డి) ఆధ్వర్యములో మెగా ఉచిత వైద్య శిభిరం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం సోమేశ్వర గ్రామంలో భూమంచిరెడ్ల రామాలయం దగ్గర కళ్యాణమండపంలో ఓమ్ని హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ నగేష్ మిత్ర బృందంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు సహకారంతో నేత్ర పరీక్షలు, శస్త్ర చికిత్సలు,గుండె సంబంధిత వ్యాధుల శస్త్ర చికిత్సలు అవసరమైనవారికి ఉచిత వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి సోమేశ్వరం గ్రామ సర్పంచ్ ఆరిఫ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందన్నారు. గ్రామంలో ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారన్నారు. చాలా మందికి వారి ఆరోగ్యం ఎలా ఉందో తెలియని పరిస్థితి ఉందన్నారు. వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందచేస్తున్నందుకు ఓమ్ని ఆసుపత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో రక్త పరీక్షలతో పాటు షుగరు బిపి పరీక్షలు నిర్వహించి ఈసీజీ కూడా తీశారు. అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
ఓమ్ని హాస్పిటల్ అధినేత సూర్యరెడ్డి,డైరెక్టర్ తమలంపూడి వెంకటరామారాడ్డి , ఓమ్ని హాస్పిటల్ సీఓఓ డాక్టర్ నగేష్ ,వైద్యులు బి సౌదామిని ,వి మురళీకృష్ణ ,బ్రహ్మాజీనాయుడు ,అరవింద్, శిరీషా , విద్యాసాగర్ ,సూర్య, హేమంత్ ,నాయుడు మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.
అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది-సర్పంచ్ ఆరిఫ్.
RELATED ARTICLES