రాజవమ్మంగి ,తూర్పు ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి గ్రామంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఆదివారం అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం చేశారు, గణేశుని నవరాత్రులు ముగించుకుని 19 రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని, భాజా భజంత్రీలు తో, మేళ తాళాలతో, స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు వినాయకుని ఊరేగించి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు, నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయులు జరగకుండా రాజవొమ్మంగి సబ్ ఇన్స్పెక్టర్ గోపి నరేంద్ర ప్రసాద్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో గణేశుని భక్తులు పాల్గొన్నారు,