కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల పరిధిలో తోవి గ్రామములో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ ఇప్పటి వరకూ అంటే 2022 ఏడాదిలో నెలకు 2500 రూపాయలు అందుతూ వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వృద్ధాప్య పెన్షన్‌ను ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ వస్తోంది. . ఇందులో భాగంగా 2023 జనవరి 1 నుంచి అంటే కొత్త ఏడాది ప్రారంభం నుంచి 2750 రూపాయలు పెంచిన పెన్షన్ ఇవ్వనుంది. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా 2 లక్షల 31 వేల మందికి పెన్షన్ మంజూరు చేసింది. తోవి గ్రామంలో బాలనాగరెడ్డి ఆదేశాలు మేరకు తోవి గ్రామ మాజీ సర్పంచ్ నరసప్పచేతుల మీదగా వృద్ధాప్యం పింఛన్ అందజేయడం జరిగింది2750 పెన్షన్ తీసుకున్న అవ్వ తాతలు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు చాలా సంతోషంగా ఉంది మాకు అన్నారు. మాజీ సర్పంచ్ నరసప్ప మాట్లాడుతూ మన గ్రామంలో టిడిపి హాయములో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అన్నారు ప్రజలకు కొళాయి పైపులు పీకి వాటిని అమ్ముకున్న మహానుభావులు టిడిపి నాయకులు ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేని పరిస్థితి దిగజారిన టిడిపి ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. మన ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వై బాలనగ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నుండి మన గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి సచివాలయం మరియు హాస్పిటల్ కట్టడం జరుగుతుంది కొత్తగా కొళాయి పైప్ లైన్ నిర్మించినాము ఇంకా కొన్ని పనులు సిసి రోడ్లు మరి ఇంకా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకుని వస్తే ఏ సమయంలో గానీ ప్రజలకు పరిష్కరిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్ సర్పంచ్ జయరాం. వైసిపి నాయకుడు. బిఎస్ నాగప్ప. రవి వాలంటరీలో వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.