నాడు నేడు అంటూ నూతన విద్యా విధానం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్య నిర్వీర్యం చేస్తుంది.

0
226

రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు

కాకినాడ జిల్లా జగ్గంపేట జూలై 12: జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని తన సగృహంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసేమని చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటూ పార్టీ ఇమేజ్ను పెంచుకోవాలని చూస్తుంది తప్ప చదువుకునే విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా ఈ నాడు నేడు కార్యక్రమాన్ని తీర్చిదిద్దలేకపోయింది అని అన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులకు లాభం చేకూరిందే తప్ప పిల్లలు యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా లేదు అని దానికి ఒకటే ఉదాహరణ మొన్న వచ్చినట్టే పదవ తరగతి యొక్క ఫలితాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఫెయిల్యూర్ శాతం పిల్లల అభివృద్ధికి ఆటంకాలు ఇకపోతే విద్యాశాఖ మంత్రికి అవగాహన లోపము విద్య పైన పొట్టు లేకపోవడం తెలియదు కానీ స్కూళ్లను మూసివేసి పిల్లలకు చదువులు దూరం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరు పిల్లలు స్కూల్కు పోయినట్లయితే వాళ్లకు పథకాలు వర్తింప చేయాలి కాబట్టి ఆ పథకాలకు వాళ్లనే దూరం చేస్తే బాగుంటుంది అని ఒకే ఒక ఆలోచన తోటి స్కూలును మూసివేసే ప్రక్రియలు చేపట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో గ్రామంలో ఒక స్కూల్ కి ఒక స్కూల్ కి ఒక కిలోమీటర్ దూరంలో ఒక స్కూల్ ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వంలో ఉన్న స్కూలును మూసివేసి ప్రైమరీ స్కూల్ కుదించి అక్కడ ఉన్నటువంటి స్కూల్ ని మూసి వేయడం జరుగుతుంది. ఈ విధంగా స్కూల్ ని మూసివేసినట్లయితే స్కూల్ దూరమైపోయి పిల్లలు స్కూల్ కి వెళ్లడం మానేస్తారు తద్వారా అమ్మబడి పథకం దూరం చేయాలని విద్యా కానుక ఎగ్ కొట్టవచ్చు మధ్యాహ్న భోజన పథకాన్ని మిగిలించుకోవచ్చు అన్నిటితో పాటుగా ఎక్కడైతే స్కూలు మూసి వేయబడ్డాయో ఆ ప్రాంతాల్ని తాకట్టు పెట్టుకోవచ్చు లేదా అమ్మేసుకోవచ్చు అనే ఒక దురుద్దేశం ఆలోచనతోటి ఈ రోజున విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం యొక్క చర్యలు ఉన్నాయి అని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పాదయాత్రలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాను అంటే అభివృద్ధి మార్పులు అనుకునే ప్రజలు ఓట్లు వేశారు కానీ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క చర్యలు ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ పిల్లల భవిష్యత్తు కాపాడాలన్న వాళ్లకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న విద్యా వ్యవస్థ పురోగతిని కృషి చేయాలి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి తప్ప పథకాలు అమలు తీయలేక విద్యా వ్యవస్థను నిర్వీరుని చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు హక్కు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here