అంతర్జాతీయ స్త్రీ హింస నిర్మూలన చేయాలని ఆర్డిటి సంస్థ.

0
156

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం కోసిగి మండలం కేంద్రంలోని ఆర్డిటి సంస్థ ATL క్రిష్ణయ్య అద్యక్షతన గ్రామాలలో ఉన్నటువంటి భార్య భర్తలకు స్త్రీలపై జరుగుతున్న హింసలను అరికట్టడానికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది.ప్రతి సంవత్సరం ఆర్డిటి సంస్థ అద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సమాజంలో ఉన్న ఆడ,మగ అన్యీ వ్యత్యాసాన్ని తగ్గించి భార్య,భర్తలు గౌరవప్రదమైన సంసార జీవితాన్ని మరియు బాలికలపై జరుగుచున్న అత్యాచారాలు , దౌర్జన్యాలు అరికట్టి భాద్యతలను గ్రామస్థాయిలో సోషయల్ యాక్షన్ టీమ్ లీడర్లు సమర్ధవంతగ నిర్వర్తించడానికి ప్రోత్సహించడం కొరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దాదాపుగా 200 మంది విద్యార్థులు మరియు గ్రామస్థాయి నుంచి 60 మంది భార్యాభర్తలు కుటుంబాలు హాజరయ్యారని కోసిగి ఏరియా టీమ్ లీడర్ కృష్ణయ్య తెలిపారు.ఈ కార్యక్రమానికి రీజియన్ డైరెక్టర్ నారాయణరెడ్డి,వీరీష్,AP మోడల్ హైస్కూల్ ప్రిన్సిపాల్ సమీరారెడ్డి,శ్రీ వివేకానంద హై స్కూల్ యాజమానం,బార్ అసోసియేషన్ అడ్వకేట్ వీరేష్, ATL క్రిష్ణయ్య మరియు ఆర్డిటి సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here