మెట్టజ్యోతి : ఏలేశ్వరం. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతన్నల సహకార సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. ఏలేశ్వరం పిఎసిఎస్ నూతన అధ్యక్షునిగా కొండపల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లుగా దాసరి రమేష్ సిరిపురపు రాజేష్ లతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్బికేలు దేశంలోనే కొనియాడ పడుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల ఇంచార్జ్ బదిరెడ్డి గోవింద్ బాబు, కన్వీనర్ అడపా పార్థసారథి, జడ్పిటిసి నూరుకొండ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ చిక్కాల లక్ష్మణరావు,మాజీ ఎంపీపీ గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జువ్వెన వీర్రాజు, మూదీ నారాయణస్వామి, సీఈవో జ్యోతుల నాగ సత్య శ్రీనివాస్, సహకార ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కడగల ఆదినారాయణ తదితరులు ఉన్నారు.
సహకార వ్యవస్థ బలోపేతానికి చర్యలు
RELATED ARTICLES