ఆంధ్రన్యూస్ : అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో 40 లక్షల రూపాయలతో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తండ్రి శ్రీ సత్తి గంగిరెడ్డి పేరుతో నిర్మించబోయే వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనానికి శంకుస్థాపన చేసి అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వారి సతీమణి ఆదిలక్ష్మి శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఈ వ్యవసాయ సహకార పరపతి సంఘం రైతులు అందరికీ ఉపయోగపడే విధంగా నిర్మాణం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ జెడ్పిటిసి సత్తి రామారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సత్తి గీతవరలక్ష్మీ వెంకటరెడ్డి, ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ (బుజ్జి), సర్పంచ్ గుడాల ధనలక్ష్మి వెంకట్రావు, ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, రాష్ట్ర బట్ట రాజు కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టి రాజు ఎంపీటీసీ కనకారెడ్డి మేడపాటి గంగిరెడ్డి సత్తి భాస్కర్ రెడ్డి, సొసైటీ చైర్ పర్సన్ తాడి సుబ్బారెడ్డి, డైరెక్టర్లు సత్తి అమ్మిరెడ్డి, చొల్లంగి హరి నాగేశ్వరరావు, మరియు వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, పొలమూరు గ్రామ మహిళలు, పాల్గొన్నారు.