ఆంధ్రన్యూస్ : శంఖవరం. వరాల దేవుడు అన్నవరం సత్యదేవుని ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత వరుపుల సుబ్బారావు వెంకటలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వదించగా,వరుపుల కుటుంబ సభ్యులు సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వరుపుల నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని ప్రారంభించారు. వరుపుల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.
సత్యదేవుని సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే వరుపుల.
RELATED ARTICLES