మెట్ట జ్యోతి ఏలేశ్వరం: సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన సౌలభ్యం మరింత పెరిగిందని ఎర్రవరం సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు అన్నారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ససివాలయ కార్యదర్శిలకు ప్రొహిబిషన్ డిక్లేర్ చేయడంతో మంగళవారం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించిందని ఆయన అన్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం సత్వరమే జరగటంతో పాటు పారదర్శకంగా ఉంటున్నాయి అన్నారు. సకాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలో సచివాలయ పాత్ర కీలకంగా మారింది అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామరాజు వర్మ, సచివాలయ ఉద్యోగులు అశోక్, తన్మయ, సత్యనారాయణ, దుర్గాప్రసాద్, అఖిల, నానిబాబు, మెర్చి, దీప్తి, తోపాటు వైఎస్ఆర్సిపి నాయకులు.