కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలంలోని హల్వి గ్రామంలోరాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేశారు అని గడప గడపకు తిరుగుతున్నారో ప్రజలకు సమస్యలు ఉంటే చెప్పాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు వారు కౌతాళం మండలం లోని హల్వి గ్రామంలో క్లస్టర్ ఇన్ చార్జ్ వల్లూరు అడివప్పగౌడ్ అధ్వర్యంలో జరిగిన ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి తిక్కారెడ్డి ఇంటింటికి తిరుగుతు ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు వైయస్సార్ ప్రభుత్వం ప్రజలకు చేస్తూన్న మోసాలు గురించి వివరిస్తూ ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు వైయస్సార్ ప్రభుత్వం లో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు కరెంట్ చార్జీలు, నిత్యావసర వస్తువులు ధరలు, ఏ మాత్రం చేయని అభివృద్ధి పై ప్రజలు పలు సమస్యలు పాలకుర్తి తిక్కారెడ్డి కి తెలియజేశారు ఆయన మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ పై ప్రజలలో మార్పు మొదలయింది రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం అని ప్రజలే తగిన మూలం చెల్లిస్తామని అన్నారు ఇదేంకర్మ-మనరాష్ట్రనికి కార్యక్రమంలో ప్రజలు విసుగెత్తి పోయారని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చేది ఖాయమని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు .ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్పగౌడ్, కాశీవిశ్వనాత్ డేని, డాక్టర్ రాజానంద్,డమ్మలదిన్ని రమేష్ గౌడ్,కురుగోడు, హల్వి గ్రామ నాయకులు మల్లప్ప గౌడ్, మౌలసాబ్, ఉసేని, తెలుగు యువత తదితరులు పాల్గొన్నారు