ఆంధ్రన్యూస్ : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం బిక్కవోలు జడ్పీ హైస్కూల్ నందు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ట్యాబుల ద్వారా విద్యార్థులు సులువుగా పాఠాలు నేర్చుకోవచ్చని, ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా పాఠాలను ఆఫ్లైన్లో కూడా నేర్చుకునే వెసులుబాటు ఉందని కాబట్టి విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు అలాగే ముఖ్యమంత్రి నాడు నేడు లో ప్రతి గవర్నమెంట్ స్కూల్ ను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని, పేద కుటుంబానికి చెందిన విద్యార్థులు తమ ఆర్థిక పరిస్థితుల వల్ల విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారని, అలాగే పేద కుటుంబానికి చెందిన విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారని ఇటువంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రొంగల పద్మావతి అప్పాజీ, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి), ఏఎంసీ చైర్మన్ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి, సర్పంచ్ సరెళ్ల సుమలత, వైస్ ఎంపీపీ బుద్ధాల కన్నారావు, ఎంపీటీసీలు జంప వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, యాదున దుర్గారావు (R.S పేట), మరియు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
RELATED ARTICLES