ఆంధ్రన్యూస్ : కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక బోజ్జవారితోట షాలేమ్ గాస్పల్ ప్రార్ధన మందిరంలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్ మెంట్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా కొంతమంది పెద్దలను నూతన వస్త్రములను, ఫ్రూట్స్ ఇచ్చి సన్మానించారు. వారి ఆరోగ్యం కొరకు ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈసందర్భంగా పాస్టర్. కరుణ్ రాజు మాట్లాడుతూ పెద్దలను గౌరవించడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను అని ఆయన అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులను వృద్ధులను అవమాన పరుస్తున్న సందర్భాలు పెద్దవారిని వృద్ధులను వారిని కొన్ని కొన్ని ప్రాంతాల్లో బ్రతికుండగానే బయట వదిలేసిన సంఘటనలు మనం తరచుగా న్యూస్ పేపర్ లో టీవీ ఛానల్ చూస్తూ ఉంటున్నాం దయచేసి పెద్దలు లేక వృద్ధులైన మన తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వయసు కలిగిన వారిని గౌరవించి చక్కగా వాని సంతోషపరిచి వారితో కొంత సమయాన్ని మనం గడుపుతున్నప్పుడు అదేవిధంగా మన పిల్లలకు పెద్దలు యొక్క ప్రాముఖ్యతను వారు మనకు ఉండడం వల్ల ఎలాంటి ఆప్యాయత ధైర్యం ఉంటుందో అంత మాత్రమే కాకుండా కొన్ని కొన్ని సందర్భంలో వారు ఇచ్చే సలహాలు మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని వారి అనుభవాలు ద్వారా మనలను సరిచేస్తూ మనం బాగుండాలని కోరుకునే వ్యక్తులని మన పిల్లలకు తెలియజేయాలి చాలామంది పెంచి పెద్ద చేసిన వృద్ధులైన తల్లిదండ్రులను పెద్దలను వారి చివరి దశలో విడిచిపెట్టి వారిని చాలా మనోవ్యాధికి గురి చేస్తున్నారని , మనం వృద్ధులైన మన తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించడం ద్వారా భవిష్యత్తులో మన పిల్లలు మనలను గౌరవించి ప్రేమిస్తారని కనుక వృద్ధులైన తల్లిదండ్రులను పెద్దవారిని మన శక్తి లోపం లేకుండా మనకి కలిగిన దాంట్లో వారిని చూసుకుంటూ వారితో కొంత సమయాన్ని కేటాయించి వారిని సంతోష పెట్టాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో యమ్.ఏలీయా,పాస్టర్ బి. నానిబాబు,టి.షాలేమ్ రాజు ,టి.బ్యూలాగ్రేస్ ,సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో వృద్ధుల దినోత్సవం
RELATED ARTICLES