లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్ సెంటర్లు ప్రారంభోత్సవం
కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక ఇంధీరనగరం మరియు నర్శింగపురం,కుమారపురంలలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్ సెంటర్ ప్రారంభోత్సవం చేసి ట్యూషన్ కి వచ్చే పిల్లలకు ఉచితంగా స్పోర్ట్స్ మెటిరియల్ అందజేశారు. ఈసందర్భంగా ట్రస్టు సభ్యులు టి.కరుణ్ రాజు మాట్లాడుతూ చాలా మంది పిల్లలు ట్యూషన్ పెట్టించుకోలేని పిల్లలను దృష్టిలో ఉంచుకుని ట్రస్ట్ తరుపున ఈట్యూషన్ సెంటర్ లను ప్రారంభించామని అదేవిధంగా ఈరోజులో పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే పుస్తకాలు ప్రక్కన పడేసి టీవీ దగ్గర వుంటున్నారని మరికొందరు సెల్ ఫోన్ కి బానిస అవ్వుతున్నారు ఇటువంటి అలవాట్లు వల్ల వారికి కళ్ళు సరిగ్గా కనపడక పోవడం మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోవడం జరుగుతుందని ఈ ఉచిత ట్యూషన్ కు వచ్చే పిల్లలు విద్యతో పాటు ఆటలు కూడా ఆడించడం జరుగుతుందని దీని ద్వారా పిల్లలు మంచి జ్ఞాపకశక్తితో పాటు మంచి ఆరోగ్యం,చదువులో ఆసక్తి కలిగి వుంటారని అందుకే ట్యూషన్ తో పాటు ఆటలు ఆడుకోవడానికి ఆటవస్తువులు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న ట్యూషన్ సెంటర్లకు ఆటవస్తువులు పాస్టర్. బి.నానిబాబు కుటుంభం స్పాన్సర్ చేశారని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో టి.కామేశ్వరరావు, అన్నమ్మ,సి.హెచ్.అన్నమణి ,టి.షాలేమ్ రాజు ,సూరిబాబు, పాస్టర్. జాన్ వెస్లీ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు