కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం పరిధిలో ఉన్న తుంగభద్ర డ్యాం ద్వారా దిగివ ఎల్ ఎల్ సి కాలువకు వస్తున్న నీరు మోకా తాలూకా దగ్గర భరదనాహాల్ వద్ద వంతెన పిల్లర్ కూలిపోవడంతో దిగువ ఎల్ఎల్సీ కాల్వకు నీరు రాక కోసిగి మండలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల కమిటీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది ఈ సందర్భంగా రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీరేష్ పూజారి శ్రీనివాసులు మాట్లాడుతూ అక్టోబర్లో కురిసిన అధిక వర్షాలకు రైతులు వేసిన ఉల్లి మిరప పత్తి వరి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని కనీసం ఎల్ఎల్సీ కాల్వ కింద అయిన సాగు చేస్తామనుకున్న రైతులకు ఆశలు ఆవిరయ్య అని వారు ఆందోళన వ్యక్తం చేశారు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోసి మండలంలోని అధికారులు ఉన్నతాధికారులు స్పందించి మండలంలని దుద్ధి మూగలదొడ్డి బెళగల్, రిజర్వాయర్లను నింపి వాటి ద్వారా కెనాల్కు కు సరఫరా చేసి రైతులకు సాగునీరుఅందించి రైతుల పంటలను కాపాడాలని వారు కోరారు.
(ఆంధ్రన్యూస్ కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బి అబ్రహం 9640441653)