కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్02 కౌతాళం మండలం పొదలకుంట గ్రామం నందు గ్రామ రైతులకు వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రైనర్ ఏపీ సీ ఎన్ ఎఫ్ మండల యూనిట్ ఇన్చార్జి అయిన E.రంగస్వామి గారు మాట్లాడుతూ సుస్థిర వ్యవసాయము మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పడం జరిగింది అనగా పి ఎం డి ఎస్ మరియు బీజ అమృతం జీవ అమృతం ఘనజీవ అమృతం మల్చింగ్ వా పిసా మరియు కషాయాలపై వివరించి డెమోస్టేషన్ ఇవ్వడం జరిగింది ఈ పద్ధతులను పాటిస్తే ప్రతి రైతు రసయానాల పురుగుమందుల వైపు వెళ్లకుండా ఉంటారని తెలియజేయడం జరిగింది మరియు తమ ఇంటి దగ్గర పరిసరాలలో ఖాళీ స్థలాలలో ఆకుకూరలు కాయగూరలు తోటలు పెంచుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కాయగూరలు తినడం వలన మన ఆరోగ్యము బాగా ఉంటుంది మరియు హాస్పిటల్ కి వెళ్ళనవసరం ఉండదు అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఫెసిలేటర్ భీమేష్ మరియు ఆర్డీపీ సంస్థ ఎక్స్టేషన్ వర్కర్ సవారయ్య గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతులు తమ వంతు సుస్థిర వ్యవసాయము మరియు ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే మన భూమి ఆరోగ్యము మరియు పర్యావరణ పరిసరాలు అన్నిటిని కాపాడుకోవచ్చని ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ సి ఎన్ ఎఫ్ మండల యూనిట్ ఇన్చార్జి ఈ. రంగస్వామి మరియు పొదలకుంట VAA. వినయ్ కుమార్ పరమేశపనాయక్ మహేష్ ICRP. సుమంగళ శివ శంకర్ గారు మరియు పొదలకుంట గ్రామ సర్పంచి పీ.రంగస్వామి నాగప్ప రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం ఫెసిలిటర్ భీమేష్ మరియు ఆర్డీపీ సంస్థ ఎక్స్టిషన్ వర్కర్ ఎన్.సవారయ్య గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823