కౌతాళం మండల కేంద్రంలో వైఎస్ఆర్సిపి లీడర్ ప్రహల్లాద ఆచారి నాయకత్వంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు . పుట్టినరోజు వేడుకల్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ప్రహల్లాదచారి మాట్లాడుతూ సీఎం జగన్ పుట్టినరోజు పార్టీ శ్రేణులకే కాకుండా, ప్రజలందరికీ పర్వదినం వంటిదన్నారు. అందుకే ఈరోజు సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.సర్పంచ్ పాల్ దినకర్ మాట్లాడుతూ పరిపాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లిన గొప్ప నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని కీర్తించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు వంటి అన్ని రంగాల్లో సీఎం జగన్ కీలక మార్పులు తీసుకొచ్చారని ప్రశంసలు కురిపించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత తీసుకురావటాన్ని ఒక యజ్ఞంలా చేస్తున్నారని కొనియాడారు. గత మూడున్నర ఏళ్లుగా రాష్ట్రంలో వచ్చిన మార్పును ప్రజలు మరియు నాయకులు సెలబ్రేట్ చేసుకున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరియు సర్పంచ్ పాల్ దినాకర్, మాజీ సర్పంచ్ అవతారం,ఎంపీటీసీ రాజ్ అహ్మద్,ఎంపీటీసీ బుజ్జిస్వామి, ఉపసర్పంచ్ తిక్కయ్య, ప్రభుత్వ పాఠశాల చైర్మన్ వడ్డే రాము,మండల మైనార్టీ లీడర్ ఇద్రుస్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
RELATED ARTICLES