కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్1 మండల పరిధిలో తిప్పలదొడ్డి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిరూపించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రాలయ ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి మాటలాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వమని అన్నారు మండలంలో ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి జగన్ తోనే సాధ్యమని అన్నారు. అదేవిధంగా గడపగడపకు కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ఎమ్మెల్యే బాలనాగరెడ్డి క్లుప్తంగా ప్రజలకు వివరించారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి. సంక్షేమ పథకాలు ద్వారా ఆయా కుటుంబాలకు పొందిన ప్రయోజనాన్ని తెలియ చేయడంతో పాటు వారు పొందుతున్న పథకాలు వివరాలతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయానా సంతకం చేసిన కార్యపత్రాన్ని.ప్రభుత్వం 3 ఏళ్ళ పాలన కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరాలతో కూడిన బుక్ లేట్ ను మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి చేతులు మీదగా వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లక్ష్మీరెడ్డి,నాగరాజుగౌడ్ .ఏకాంబరెడ్డి,జెడ్పిటిసి రాధా ప్రియదర్శిని,ఎంపిపి అమరేష్,ఎంపీపీ బుజ్జి స్వామి,వడ్డే రాముడు,
తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ,ఎండిఓ జగన్మోహన్ రెడ్డి,ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి,వివిధ శాఖ అధికారులు వైసీపీ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823