మెట్టజ్యోతి: జంగారెడ్డిగూడెం. స్థానిక సీతా మహాలక్ష్మి వృధ్ధ ఆశ్రమానికి సూర్య ఎలెక్ట్రానిక్స్ అధినేత డాక్టర్ రాజాన సత్యనారాయణ చేతుల మీదుగా, లోకవరపు ప్రశాంత్ కుమార్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా లోకవరపు అప్పలనాయుడు, శ్రీమతి మహాలక్ష్మి కుటుంబ సభ్యులు రూ 10,116/లు విరాళం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజాన మాట్లాడుతూ మానవ సేవ యే మాధవ సేవగా గుర్తించి నిరుపేద వృద్దులకు ఆర్థిక సహాయం అందించడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. ఆశ్రమ వ్యవస్థాపకుడు జయవరపు శేఖర్ నీ, నిర్వాహకులను అభినందించారు. జయవరపు శేఖర్ మాట్లాడుతూ వృధ్ధ ఆశ్రమం స్థాపించి, నిర్వహించగలగడం తన పూర్వ జన్మ సుకృతం అని,సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో రొంగల నాగేశ్వరావు, కారింగుల రాము, చిట్లూరి సుబ్బారావు, నౌడు నూకరాజు మరియు లోకవరపు అప్పల నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొని, ప్రశాంత్ కుమార్ చే బర్త్ డే కేకు కట్ చేయించి వృద్దులకు పంచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నూకాలమ్మ ఆలయ మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు