(అనంతపురం ఆంధ్రన్యూస్)
అనంతపురం జిల్లా కేంద్రంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాపరెడ్డి అధ్యక్షతన మాజీ ప్రధాని మంత్రి ఉక్కు మహిళ స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ గారి 38వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండ్లపల్లి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఉక్కు మహిళ, మొట్టమొదటి మహిళా ప్రధాని గా ఎన్నో సంస్మరలను చేసి అద్భుతమైన పథకాలతో పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపిన ప్రధానిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకురాలు ఇందిరమ్మ. ఎంతో మంది రాజకీయ నాయకులకు, మహిళలకు ఆదర్శప్రాయం మరియు దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిందని అన్నారు. ఇందిరమ్మ ఆశయాలను కొనసాగించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాపు గాజుల వాసు,ఓబీసీ జిల్లా చైర్మన్ రామ్ చరణ్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల సంఘం జిల్లా చైర్మన్ మసాలా రవి,సింగనమల మండల కన్వీనర్ పూల ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల ఫక్రుద్దీన్, గార్లదిన్నె మండల కన్వీనర్ ఓబిరెడ్డి,రుద్రంపేట మండల కన్వీనర్ శర్మాస్ వలి రాయదుర్గం పీసీసీ సభ్యులు కొరివి నాగరాజు,ఎమ్మార్పీసీ నాయకులు సాకే ప్రకాష్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు