(కౌతాళం ఆంధ్రన్యూస్)
కౌతాళం : మండల పరిధిలోని బదినేహాల్ గ్రామంలో తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మంత్రాలయం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి తిక్కరెడ్డి సహకారంతో ఈ రాష్ట్రానికి ఇదేమి ఖర్మ కార్యక్రమం ప్రజల్లో దూసుకో వెళుతుందని తెదేపా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ ఇంచార్జ్ వేంకటపతి రాజు అన్నారు. అనంతరం క్లస్టర్ ఇంచార్జ్ మరియు గ్రామ టిడిపి నాయకులు మాటూరు నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జగన్ ను ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మూడున్నర సంవత్సరాలలో జగన్ పాలనలో ప్రజలకు ఏమి చేసింది లేదు, ఏమి ఒరిగింది లేదని అన్నారు. ఒక ఛాన్స్ అని ప్రజలను నిట్ట నిలువునా మోసం చేసిన ఘనత జగన్ అని అన్నారు. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రతి గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని అన్నారు.ఈ రాష్ట్రానికి ఒక పీడ ముఖ్యమంత్రి పాలన ఇంకా ఏడాదిన్నర ఉందని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని ప్రజలకు ధైర్యం చెప్పారు. అనంతరం ఈ కార్యక్రమంలో బదినేహాల్ టిడిపి గ్రామ సీనియర్ నాయకులు వలి భాష ఉమేష్ గౌడ్ వీరేష్ ఎరుకల ఈరన్న బోయ బసవ మరియు తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.