కౌతాళం ఆంధ్ర న్యూస్ అక్టోబర్ 29 కౌతాళం మండల పరిధిలో బదినేహల్ గ్రామంలో ఈ ఏడాది అధిక వర్షాలు కారణంగా కుంటానహల్ దారిలో కంబాలి తాత దర్గా దగ్గర బ్రిడ్జివరదలవల్ల .కూలిపోవడంతోగతంలోనేతాత్కాలికంగా మూడు,నాలుగు సార్లు ఏర్పాటు చేసిన అధిక వరదలు రావడంతో నిలవ లేక పోయింది.అటు కుంటానహల్ దారిలో వందల సంఖ్యలో రైతులు పొలం పనులకు వెళ్ళడానికి చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇదే విషయాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి అత్రి గౌడకు గ్రామ ప్రజలు తెలియజేశారు.అత్రి గౌడ మంత్రాలయ ఎమ్మెల్యే బాలనాగరెడ్డితెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రైతులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక వంతేన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ రోజు జేసిబితో పనులు చేసి 25 ట్రక్కులు గరుసు వేయడం జరిగింది. ఎమ్మెల్యే మరియు అత్రి గౌడ సలహా మేరకు అత్రి గౌడ యూత్ సభ్యులు గ్రామంలోని పెద్దలు దగ్గరుండి పనులు ప్రారంభం చేశారు.దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు ఎమ్మెల్యే విన్నవించారు. అడిగిన వెంటనే వంతేనకు తాత్కాలిక పరిష్కారం చూపి ఎమ్మెల్యే మరియు,అత్రి గౌడ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ మా బాల నాగిరెడ్డి మాక ఎమ్మెల్యే కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కటికే ఖాదర్ భాష , హెచ్ పి చాంద్ భాష, ఎస్. పి మల్లి,మాబుసాబ్, కాంబ్లీ భాష, అత్రి గౌడ యూత్ సభ్యులున్నారు.
కౌతల మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823