కౌతాళం డిసెంబర్ 06 ఆంధ్రన్యూస్ కౌతాళం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రహల్లాద ఆచారి ఆధ్వరంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు.కౌతాళం మండలం మేజర్ పంచాయతీ సర్పంచ్ పాల దినకర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంరాజ్యాంగ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన ముసాయిదా కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు.డా. అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను సమర్పించడం, దానిపై లేవనెత్తిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మరియు రాజ్యాంగ పరిషత్ సూచనల మేరకు అవసరమైన మార్పులు చేయడం వంటి పనులను నిర్వహించారు.ఇలా అంబేద్కర్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్ దినకర్,మరియు వైస్ ఎంపీపీ బుజ్జీ స్వామి,ఉప సర్పచ్ సక్కరి తిక్కయ,వడ్డె రామన్న,ఎంపీటీసీ రాజంఅహ్మద్,మాజీ సర్పంచ్ అవతారం, సత్యప్ప స్వామి, సమద్,వార్డ్ మెంబర్ సుమన్,రామకృష్ణ,ఈరన్న,పార్టీ కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823