కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల పరిధిలోని కాత్రికి గ్రామంలో బుధవారం గ్రామ దేవత మారమ్మ దేవి దేవర ఉత్సవాలును గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రజలకు దేవతలు కృప ప్రజలకు ఎల్లప్పుడును ఉండాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు యువత జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు వారు కౌతాళం మండలం లోని కాత్రికి , గుడికంబాలి, నదిచాగి, తిపులదోడ్డి, కరిణి,గ్రామాలలో జరిగిన దేవర మహోత్సవం లో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు వారికి ఆయా గ్రామాలు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాల తో సన్మానించారు ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు,జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్,తిపులదోడ్డి నీలకంఠ రెడ్డి, శివప్పగౌడ్, నరసింహులు, కాత్రికి మాజీ సర్పంచ్ చంద్ర, ఈడిగ ఈరన్న ,గుడికంబాలి మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్, తిపులదోడ్డి సర్పంచ్ మల్లయ్య, హనుమేష్,ఈరన్న, టి యన్ యస్ ఎఫ్ ఉపాధ్యక్షులు రామచంద్ర నాయుడు, తదితరులు పాల్గొన్నారు.