మెట్టజ్యోతి:ఏలేశ్వరం:బ్యాంకు రుణాలనుసద్వినియోగంచేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ మేనేజర్ సుశీల్ కుమార్ అన్నారు. మండలంలోని యర్రవరంలో గ్రామ పంచాయతీలో ఆర్దిక సమళీకృత విధానంపై ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకుడు నీరుకొండ సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పలు సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ప్రభుత్వ సహకారంతో పొందిన బ్యాంకు రుణాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కేంద్ర ప్రభుత్వం అర్బన్ ప్రాంతంలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకింగ్ రంగం ద్వారా సేవలు మరింత వేగవంతంచేసే విధంగా సెంట్రల్ సోషల్ సెక్యూరిటీ స్కీం లో పైలట్ ప్రాజెక్టుగా దేశ వ్యాప్తంగా ఏడు జిల్లాలు ఎంపిక చేశారు. దీనిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ జిల్లాను ఎంపిక చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్ర, పశు పోషణ, మత్స్యకారులకు రుణాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జీరో బ్యాలెన్స్ అకౌంట్లు వంటి పలు రకాల బ్యాంకు రుణాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చిరంజీవి రాజు, వైసిపి నాయకులు గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
RELATED ARTICLES