కౌతాళం అక్టోబర్ 10 (ఆంధ్ర న్యూస్ )
కౌతాళం మండల పరిధిలో బదినేహాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.రవీందర్ రెడ్డి మరియు కౌతాళం మండలం కో ఆప్షన్ మెంబర్ బి.మామసాహెబ్ బదినే హాల్ గ్రామ సర్పంచ్ మాల రామప్ప పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించడం జరిగింది. బి.రవీంద్రారెడ్డి రామప్ప కనన ఖర్చులకు 20వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది.వీరు మాట్లాడుతూ రామప్ప అకాల మరణం మమ్మల్ని కలిచివేసిందని, రామప్ప గారు మరణించడం మా కుటుంబానికి తీరనిలోటని వారు పేర్కొన్నారు. రామప్ప గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. తర్వాత శనివారం మృతి చెందిన బదినే హాల్ గ్రామం ఎంపిటిసి అరికాలప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు శివారెడ్డి యూత్ సభ్యులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823