కౌతాళం అక్టోబర్ 30 ఆంధ్ర న్యూస్:- మంత్రాలయం నియోజకవర్గంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్ నాయుడు అన్నారు .తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన బంగారయ్య గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకోని వాళ్ళ కుటుంబం తొ ఫోన్ ద్వారా విషయాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీ తరుపున ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారాలు అందిస్తామని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిపెంచి తన వంతు గా సహాయంగా 10000 రూపాయలను మరియు సురేష్ నాయుడు యూత్ తరుపున 16000 రూపాయలను మొత్తం గా 26,000 రూపాయలను సురేష్ నాయుడు గారు బంగారయ్య వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.కార్యకర్తలకు కష్టం వచ్చినా ఎల్లపుడు నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాము అని నా ఈ రాజకీయ జీవితం మంత్రాలయం తెలుగుదేశం పార్టీకే అంకితం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం తెలుగు యువత నాయకుడు సతీష్ నాయుడు మేఘనాథ్ అమ్ము వలి కృష్ణ శేకు నాగరాజు రహిమాన్ గొట్టయ్య రామంజి పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823