కౌతాళం (ఆంధ్రన్యూస)
కౌతాళం మండలం పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి తెలిపారు. బుధవారం మండల లోని రౌడూరు గ్రామం లో రెండవ రోజు గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి గత మూడేళ్లలో మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరిస్తూ, ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాలను క్షుణ్ణంగా వివరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న. మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా సంక్షేమ పథకాలు మాత్రం ముందుకు తీసుకెళ్లడం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని తెలిపారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైతుల కోసం 5 ఎత్తిపోతల పథకాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. అనేక గ్రామాల్లో జల జీవన్ పథకం కింద నిధులు తీసుకొచ్చి తాగునీటి సమస్య పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర యువ నాయకులు వై.ప్రదీప్ రెడ్డి, అత్రి గౌడ్. ఉరుకుంద ఈరన్న ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగరాజు గౌడ్, దేశాయ్ ప్రహ్లాద చారి, నీలకంఠ రెడ్డి. చెన్నప్ప, ఏకం రెడ్డి, సుధాకర్ రెడ్డి, సోమిరెడ్డి, మల్లికార్జున రెడ్డి, నర్సారెడ్డి, ఎంపిపి అమ్రేష్, వైస్ ఎంపిపి బుజ్జి స్వామి, హై స్కూల్ చైర్మన్ వడ్డే రామన్న. సర్పంచ్ పాల్ దినకర్. సుబ్బరాజు.సిద్ధన్న గౌడ్, అబ్దుల్ సమ్మర్ మౌలా. శివరాం గంగము ఆయా శాఖ అధికారులు ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటరీలు మరియు మండల లో వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.