ఏలేశ్వరం: మండలంలోని సిరిపురం గ్రామంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని ఆదివారం అందిన సమాచారం మేరకు ఏలేశ్వరం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిపురం శివారు పంపు షెడ్డు వద్ద పేకాట శిబిరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుండి 2040 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ రత్నాకర్, కానిస్టేబుల్స్ లోవరాజు, పండుదొర, బ్రహ్మానందరావు, రమణ పాల్గొన్నారు.