శంఖవరం,: మండలం లోని గిరిజన గ్రామాల ముఖద్వారమైన పెదమల్లాపురం గ్రామంలో నేడు మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ సర్పంచ్ పసగడుగుల నాగేశ్వరరావు తెలిపారు.అంజు కంటి ఆసుపత్రి కాకినాడ వైద్య శిబిరం వారిచే పెదమల్లాపురం ఆశ్రమ పాఠశాల వద్ద పరమహంస యోగా నంద నేత్రాలయం వేమగిరి వారిచే ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని దీని ద్వారా కంప్యూటర్ పై చత్వార పరీక్షలు,తలపోటు పరీక్షలు చేసి మందులు ఉచితంగా ఇవ్వబడును అని కంటిలో శుక్లములు ఉన్నవారికి క్యాటరాక్ట్ ఆఫరేషన్ ఉచితంగా చేయబడును అని ఆఫరేషన్ కి వచ్చే వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని రావాలని గిరిజన గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగేశ్వరరావు తెలిపారు.