ఆంధ్రన్యూస్ : రాజమండ్రి. రాజమండ్రిలో తండ్రి, తన ఇద్దరు కుమార్తెలతో బలవన్మరణానికి పాల్పడటం పట్ల రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి నగరంలోని వీఎల్ పురం మృతుల ఇంటికి వెళ్ళి మృతదేహాలను పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రాజమండ్రి నగరం వీఎల్ పురం లో నివసిస్తున్న సత్యేంద్ర తన ఇద్దరి కుమార్తెలతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సత్యేంద్ర (40) జీఎస్టీ బిల్స్ చేసేవారు. ఈ నెల 18వ తేదీ రాత్రి సత్యేంద్ర భార్య బంధువుల ఇంటికి వెళ్ళగా, మర్నాడు అంటే సోమవారం ఉదయం వీరు అఘాయుత్యానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. రాజవోలు రోడ్డులో చేపల చెరువులో ఇద్దరు కుమార్తెలను రిషిత (12), హాద్విక (7)లను తోసేసి, ఆ తరువాత సత్యేంద్ర కూడా దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎంపీ భరత్ కు, పోలీసులకు పలువురు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, పని వత్తిడితోనే ఇలా చేసినట్టు అతను ఒక సూసైడ్ లెటర్ రాసినట్టు ఎంపీ భరత్ కు ఆ ప్రాంత వాసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతిచెందడం పట్ల ఎంపీ భరత్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. పార్థివ దేహాలను చూసి చలించిపోయారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి తనకు పూర్తిగా తెలియజేయాలని బొమ్మూరు సీఐ విజయ్ కుమార్ ను ఎంపీ భరత్ ఆదేశించారు.
పార్థివ దేహాలను సందర్శించి నివాళులర్పించిన ఎంపీ భరత్
RELATED ARTICLES