కౌతాళం (ఆంధ్ర న్యూస్) అక్టోబర్19
మంత్రాలయం నియోజకవర్గ
పల్లెల ప్రగతికి కృషి చేస్తానని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు /మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి బుధవారం మండల పరిధిలోని నారాయణపురం, కాచాపురం గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామాల్లో గడపగడపకు వెళ్లి పెన్షన్ అందుతుందా అవ్వ, రైతు భరోసా పడిందా అన్న, అమ్మ ఒడి వచ్చిందా అమ్మ, ఖాళీ స్థలం ఉంటే ఇళ్లు కట్టుకో అవ్వ అవసరమైన సామాగ్రి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని వివరిస్తూ లబ్దిదారులకు మంజూరైన సంక్షేమ పథకాలను చదివి వినిపించారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సోంత గ్రామాలు కావడంతో అభివృద్ధి కి నోచుకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి హామీ ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఐసిడిఎస్ తరుపున మంజూరైన సెల్ ఫోన్ లను అంగన్ వాడీ సిబ్బంది కి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కాచాపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు పెట్రోలు బంక్ శీనన్న ఇంటి వద్ద ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి శాలువ కప్పి, పూలమాలలు వేసి సన్మానించారు. అంతకు ముందు నారాయణపురం గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు నాయకులు, కార్యకర్తలు గజమాల వేసి శాలువ కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి, ఇన్ చార్జ్ /వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి నాయకులు కృష్ణ రెడ్డి, బాబిరెడ్డి, పెట్రోలు బంక్ శీనన్న, ఎంపిడిఓ ప్రభావతి, పీఆర్ జేఈ నర్సింహులు, తహసీల్దార్ చంద్ర శేఖర్, ఆర్డబ్ల్యూఎస్ వేద స్వరూప, ఐసీడీఎస్ సూపర్ వైజర్ నాగలక్ష్మి, ఏపీఎం జయశ్రీ, ఏపివో తిమ్మారెడ్డి, ట్రాన్స్ కో ఏఈ గోవిందు, ఏవో జీరా గణేష్ నాయకులు గురురాజు పాల్గొన్నారు
ఆంధ్రన్యూస్ రాయలసీమ జోన్ రిపోర్టర్ బి. అబ్రహం 9640441653